విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. తిరుపతిలో కూటమి 'సంక్షేమం' సభ వాయిదా
- కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభకు ఏర్పాట్లు చేసిన నేతలు
- స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతితో రాష్ట్రంలో విషాదశ్చాయలు
- జనసేన నేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత మాధవ్ తో చర్చించి వాయిదా నిర్ణయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తిరుపతిలో జూన్ 9న నిర్వహించ తలపెట్టిన 'సంక్షేమ' బహిరంగ సభను వాయిదా వేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తొలి విజయోత్సవ సభను 'సంక్షేమం' పేరిట తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించిన విషయం విదితమే. ఈ క్రమంలో తొలి విజయోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సభను విజయవంతం చేసేందుకు గత రెండు రోజులుగా కూటమి నేతలు, అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే, స్టీల్ ప్లాంట్ దుర్ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇతర మిత్రపక్ష నేతలతో సంప్రదింపులు జరిపి సభను వాయిదా వేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే తిరుపతి రూరల్ మండలం దామినేడులో భారీ బహిరంగ సభ నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యువనేత నారా లోకేశ్‌తో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితర కూటమి నేతలు హాజరుకావాల్సి ఉంది. విశాఖ దుర్ఘటన కారణంగా సభను వాయిదా వేసిన కూటమి నేతలు, తిరిగి ఇదే ప్రాంగణంలో జూన్ 12న సభను నిర్వహించనున్నారు.